TG Inter Exams 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ తేదీలను తప్పక గుర్తుంచుకోవాలి.
ఫిబ్రవరి 25 నుంచి మెయిన్ పరీక్షలు ప్రారంభం ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన మెయిన్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మొదలై, మార్చి 18వ తేదీ వరకు జరుగుతాయి.
ఇంటర్ ప్రాక్టికల్స్, ఎథిక్స్ పరీక్షల తేదీలు
ముందుగా ప్రాక్టికల్ పరీక్షలు మరియు ప్రత్యేక పరీక్షలు జరుగుతాయి. వీటి వివరాలు ఇక్కడ చూడండి:
ప్రాక్టికల్ పరీక్షలు:
* ప్రారంభం: ఫిబ్రవరి 2, 2026
* ముగింపు: ఫిబ్రవరి 21, 2026
ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు:
* జనవరి 21: ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష
* జనవరి 23: ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్
* జనవరి 24: ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్
ఇంటర్ ఫస్ట్ ఇయర్ (I Year) పరీక్షల షెడ్యూల్ 2026:
తేదీ,                పేపర్ పేరు
ఫిబ్రవరి 25,       పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -1)
ఫిబ్రవరి 27,       పార్ట్ 2 – ఇంగ్లీష్ పేపర్ -1
మార్చి 02,       మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
మార్చి 5,        మ్యాథ్స్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
మార్చి 9,         ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
మార్చి 03,       కెమిస్ట్రీ, కామర్స్
మార్చి 17,       మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ – 1
ఇంటర్ సెకండ్ ఇయర్ (II Year) పరీక్షల షెడ్యూల్ 2026:
తేదీ,                 పేపర్ పేరు
ఫిబ్రవరి 26,        పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2)
ఫిబ్రవరి 28,        పార్ట్ 1 – ఇంగ్లీష్ పేపర్ -2
మార్చి 03,        మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
మార్చి 6,         మ్యాథ్స్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
మార్చి 10,        ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
మార్చి 13,       కెమిస్ట్రీ, కామర్స్ -2
మార్చి 16,       పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2
మార్చి 18,       మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ – 1


