Benefit Shows: తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోస్ లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాటోగ్రఫీ చట్టానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.
సినిమా టిక్కెట్ల ధరలు, స్పెషల్ షోలకు అనుమతుల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదిస్తూ టికెట్ ధరల పెంపునకు మంజూరు చేసిన అనుమతులను ఇప్పటికే రద్దు చేశామన్నారు తెలిపారు.
వాదనలు విన్న తర్వాత, కోర్టు సినిమాటోగ్రఫీ చట్టానికి కట్టుబడి ఉండాలి అని నొక్కి చెప్పింది, ఇది 1:30 AM మరియు 8:40 AM మధ్య ఎటువంటి ప్రదర్శనలను అనుమతించకూడదని నిర్దేశించింది. చట్టంలోని నిబంధనలను అధికారులు కచ్చితంగా పాటించాలని కోర్టు సూచించింది.