Telangana

Telangana: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల

Telangana:  తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ (TGPSC) శుక్రవారం ప్రకటించింది. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మార్కులు, జనరల్ ర్యాంక్‌ల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అలాగే, తుది ఆన్సర్ కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, ఓఎంఆర్ షీట్లు కూడా అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసింది.

Also Read : America: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో అగ్ని ప్రమాదం – 172 మంది ప్రయాణికులు క్షేమం

ఈసారి 1,365 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ కోసం 5,36,400 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పరీక్షలకు 50.24% మంది మాత్రమే హాజరయ్యారు. టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలను ప్రకటించగా, ఇప్పుడు గ్రూప్-3 ఫలితాలను వెల్లడించింది.

అదనంగా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను మార్చి 17న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  TG Inter Supply Results: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *