Hydra : హైడ్రాకు ఫుల్ పవర్స్… ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం

హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయగా తాజాగా అందుకు సంబంధించిన గెజిట్ విడుదలైంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రహదారులు, నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు, పార్క్​ల రక్షణ కోసం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.

అయితే చట్టబద్ధత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్‌ రక్షణగా ఉండనుంది. చట్టబద్దత లేదని గగ్గోలు చేసిన ప్రతిపక్షాల నోరు మూయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గేదెలే అనే రీతిలో హైడ్రా చట్టబద్దత దిశగా ముందడుగు వేసిందని చెప్పవచ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nandyal: నంద్యాల‌లో దారుణం.. ప్రేమించ‌డం లేద‌ని యువ‌తిపై దుండ‌గుడి ఉన్మాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *