Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో జరగనున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఇదే రోజు (నవంబర్ 25) క్యాబినెట్ భేటీ జరుగుతుంది. ఈ భేటీలో కీలక చర్చల అనంతరం ఎన్నికల నిర్వహణపై ఒక క్లారిటీ వస్తుంది. అదే విధంగా ఇదే రోజు రాష్ట్ర హైకోర్టులో కూడా కేసు విచారణ ఉన్నది. దానిపైనా ఎన్నికల నిర్వహణ అంశంపై కీలక ఆదేశాలు రానున్నాయి. వచ్చే మూడు నెలల్లో పరిషత్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంటుంది.
Telangana: ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలకు ఒక్కొక్కరికీ వేతనాలు ఎంతో అన్న ఆసక్తి అంతటా నెలకొన్నది. ఆశావహుల్లో, ఇతర రాజకీయ పరిణతి ఉన్న నాయకులకు విధులు, విధి విధానాలతోపాటు వేతనాలపైనా క్యూరియాసిటీ ఉన్నది. అదే విధంగా పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొన్నది.
Telangana: ఈ మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన రెండేండ్ల అనంతరం 2016 నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతనాలు ఇచ్చేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సర్పంచ్‌కు, ఎంపీటీసీ సభ్యులకు నెలకు రూ.5,000 చొప్పున ఇస్తూ వచ్చింది. దానినే 2021 నుంచి 2023లో సర్పంచులు, ఆ తర్వాత ఎంపీటీసీ సభ్యులు పదవి నుంచి దిగిపోయే వరకు ఆ వేతనాన్ని రూ.6,500గా ఇచ్చారు.
Telangana: అదే విధంగా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు, మండల పరిషత్ అధ్యక్షులకు పదవుల కాలపరిమితి ముగిసే నాటికి నెలకు రూ.13,000 చొప్పున వేతనాల రూపంలో ప్రభుత్వం ఇచ్చేది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాత అదే వేతనాలను ఇస్తుందా? లేక కొత్తగా వేతనాలను పెంచుతుందా? అన్న అంశాలపై ఆసక్తి ఉన్నది.
Telangana: అదే విధంగా ఎన్నికల ఖర్చుల వివరాలను కూడా తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. సర్పంచ్‌గా పోటీ చేసే వ్యక్తి గ్రామ పంచాయతీ పరిధిలో రూ.2.50 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.50 లక్షలు, జడ్పీటీసీ సభ్యుడు రూ.4 లక్షలు, వార్డు సభ్యుడు రూ.50 వేల వరకు ఖర్చు చేసే పరిమితిని ఎన్నికల సంఘం విధించింది. దానికి మించి ఎవరైనా ఖర్చు పెట్టినట్టు నిర్ధారణ అయితే మూడేళ్ల పాటు ఎన్నికల్లో అనర్హులు అవుతుఆరు. గెలిచినా పదవిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

