Telangana:తెలంగాణ సర్కారు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీజీఎస్ ఆర్టీసీలో వినూత్న తరహాలో సరికొత్త సేవా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సామాజిక బాధ్యతలో భాగంగా యాత్రాదానం అనే కార్యక్రమాన్ని అమలు చేయనున్నది.
Telangana:వ్యక్తులు, సంస్థల తరఫున తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగుల, ఇతర శుభకార్యాయలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు, ఆనందదాయకమైన రోజుల్లో స్పాన్సర్ చేయాలని ఆర్టీసీ పిలుపునిచ్చింది. వారి స్పాన్సర్‌తో వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహార యాత్రలకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారో వారు తగినంతగా ఆర్టీసీకి విరాళంగా అందజేయాలని సూచించింది. అలాంటి వారికి టీజీఎస్ ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని కల్పిస్తుంది.
Telangana:ఈ మేరకు ఈ యాత్రదానం కార్యక్రమ పోస్టర్‌ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి నిన్న ఆవిష్కరించారు. ఈ యాత్రాదానం కార్యక్రమ నిర్వహణ కోసం ప్రత్యేక నిధిని ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా ప్రకటించారు. దీనికోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలను కూడా ప్రకటించిందని వెల్లడించారు.
Telangana:ఈ కార్యక్రమంలో వ్యక్తులతో పాటు ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, అసోసియేషన్లు, ఎన్జీవోలు స్పాన్సర్ చేయొచ్చని తెలిపారు. దాతలు ఇచ్చే విరాళాన్ని బట్టి కిలోమీటర్ల ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను యాత్రలకు సంస్థ ఏర్పాటు చేస్తుంది. టూర్ ప్రారంభానికి వారం ముందే బస్సులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

