IND vs AUS

IND vs AUS: టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..

IND vs AUS: త్వ‌ర‌లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న టీమ్ఇండియా జ‌ట్ల‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్ర‌క‌టించింది. ఈ టూర్‌లో జ‌రిగే మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల కోసం సెల‌క్ట‌ర్లు వేర్వేరు జ‌ట్ల‌ను ఎంపిక చేశారు. ముఖ్యంగా, వ‌న్డే ఫార్మాట్‌లో కెప్టెన్సీ మార్పు చేయ‌డం పెద్ద మార్పుగా క‌నిపిస్తోంది.

వ‌న్డేల‌కు గిల్ సారథ్యం
ఆస్ట్రేలియాతో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వ‌న్డేల సిరీస్‌కు భార‌త జ‌ట్టు సార‌థిగా శుభ్‌మ‌న్ గిల్‌ను ఎంపిక చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌ను ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి, ఒక సాధార‌ణ ఆట‌గాడిగా జట్టులో కొన‌సాగించారు. అలాగే, సీనియ‌ర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీకి కూడా వ‌న్డే జ‌ట్టులో చోటు ద‌క్కింది. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

వ‌న్డే జ‌ట్టు ముఖ్య సభ్యులు:
కెప్టెన్: శుభ్‌మ‌న్ గిల్
వైస్ కెప్టెన్: శ్రేయస్ అయ్యర్
ఇతరులు: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అక్ష‌ర్ ప‌టేల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాద‌వ్‌, ముహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, య‌శ‌స్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్).

2027లో జ‌ర‌గ‌బోయే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ మార్పు చేసిన‌ట్లు తెలుస్తోంది. నాటికీ రోహిత్ శ‌ర్మ‌ వ‌య‌స్సు 40కి చేరుకుంటుంది. ఈ నేప‌థ్యంలో, యువ ఆట‌గాడు గిల్‌కు ఇప్ప‌టి నుంచే సార‌థ్య బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించి భ‌విష్య‌త్తుకు సిద్ధం చేయాల‌ని బీసీసీఐ భావించిన‌ట్లు స‌మాచారం.

Also Read: IND-WI: వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా

టీ20ల‌కు సూర్య‌నే కెప్టెన్‌
ఆస్ట్రేలియాతో ఈ నెల 29 నుంచి జ‌ర‌గ‌నున్న ఐదు టీ20ల సిరీస్‌కు మాత్రం కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్‌నే కొన‌సాగించారు. టీ20ల‌లో నిల‌క‌డ‌గా రాణిస్తున్న సూర్య‌కుమార్ నేతృత్వంలోనే టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. యువ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌ను ఈ ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా నియమించారు.

టీ20 జ‌ట్టు ముఖ్య సభ్యులు:
కెప్టెన్: సూర్య‌కుమార్ యాద‌వ్
వైస్ కెప్టెన్: శుభ్‌మ‌న్ గిల్
ఇతరులు: అభిషేక్ శ‌ర్మ‌, నితీశ్ కుమార్ రెడ్డి, శివ‌మ్ దూబె, అక్ష‌ర్ ప‌టేల్, జితేశ్‌ శ‌ర్మ (వికెట్ కీప‌ర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాద‌వ్‌, సంజు శాంస‌న్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.
ఈ రెండు సిరీస్‌ల‌లోనూ యువ ఆట‌గాళ్లైన నితీశ్ కుమార్ రెడ్డి, హ‌ర్షిత్ రాణా, ధ్రువ్ జురెల్ వంటి వారికి జ‌ట్టులో అవ‌కాశం ద‌క్కింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *