Chandrababu Naidu 75th Birthday

Chandrababu Naidu 75th Birthday: చంద్రబాబు పుట్టినరోజు సంబర్భంగా తిరుమలలో 750 కొబ్బరి కాయలు కొట్టి 7 కేజిల కర్పూరం వెలిగించిన టీడీపీ శ్రేణులు!

Chandrababu Naidu 75th Birthday: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ. చంద్రబాబు 75 వ జన్మదినం సందర్బంగా 750 కొబ్బరి కాయలను కొట్టి మొక్కులు., 7 కేజీల ఐదువందల గ్రాముల కర్పూరాన్ని వెలిగించారు. తమ అభిమాన నేత దీర్ఘాయిస్సు, టీడీపీ అధికారంలోకి వచ్చేలా చూడు గోవింద అంటూ మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం టీడీపీ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ…. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో కొబ్బరి కాయలు కొట్టమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న చంద్రబాబుకు ఆయురారోగ్యాలు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు.ప్రజా శ్రేయస్సు కోరారు సీఎం చంద్రబాబు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయం కావాలని ఆకాంక్షించారు. 75వ జన్మదినం సందర్బంగా 750 కొబ్బరి కాయలను కొట్టి మొక్కులు., 7 కేజీల ఐదు వందల గ్రాముల కర్పూరాన్ని వెలిగించామన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *