Tarak: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన 31వ ప్రాజెక్ట్‌తో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ జోరందుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి జాయిన్ కానున్నారు.
తాజాగా, షూటింగ్ కోసం ఎన్టీఆర్ మంగళూరు బయలుదేరారు. ప్రశాంత్ నీల్ తనదైన మాస్ స్టైల్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రికార్డులు బద్దలు కొట్టేలా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని టాక్. హీరోయిన్‌గా రుక్మిణి వాసంత్ నటిస్తున్నట్లు సమాచారం.
Also Read: SSMB 29: ఎస్‌ఎస్‌ఎంబీ 29లో భారీ వాటర్ సీక్వెన్స్!
Tarak: సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ‘డ్రాగన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!