Tamilnadu: తమిళనాడు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల అతి భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. రోజూవారీ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఏర్పడి ప్రజలు అతలాకుతలమవుతున్నారు. మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. చెన్నై నగరంతోపాటు 12 తీర ప్రాంత జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Tamilnadu: తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నాగపట్నం జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ఇండ్లు జలమయమయ్యాయి. కడలూరు, మైలాడుదురై, తిరువారూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావం ఇంకా 48 గంటల పాటు ఉంటుందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పుదుచ్చేరిలోని కారైకాల్‌లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.