Dhanush vs Nayanatara: హైకోర్టుకు ధనుష్, నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వివాదంచేరుకుంది. నయనతార తన కాపీరైట్‌ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ధనుష్ నటిపై మద్రాస్ హైకోర్టులో సివిల్ దావా వేశారు. ధనుష్ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది . బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో నయనతార వివాహానికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న డాక్యుమెంటరీ విషయంలో వివాదం నడుస్తోంది .
ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ థాన్’ చిత్రంలోని సన్నివేశాలను డాక్యుమెంటరీలో నయనతార చేర్చడంపై వివాదం నెలకొంది. ఈ సన్నివేశాలను చేర్చడానికి సంబంధించి ధనుష్ నయనతార నుండి 16 కోట్లు డిమాండ్ చేశాడు. నాయనతార ఈ విషయంపై ధనుష్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. దీంతో ధనుష్ ఇప్పుడు కోర్టులో సివిల్ కేసు వేశారు.
అసలు కారణం ఇదీ . .
సినిమా రంగంలో తెర చాటున జరిగే ఎన్నో వ్యవహారాలు కొన్ని సంవత్సరాల తర్వాత కానీ బయటకు రావు. తాజాగా స్టార్ హీరో ధనుష్, సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు బట్టబయలైంది. ధనుష్ పంపిన లీగర్ నోటీస్ తో నయన్ లోని ఆవేశం కట్టలు తెంచుకుంది
ధనుష్ ఇవాళ జాతీయ స్థాయిలోనే కాదు… అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న మంచి నటుడు. ఇక నయన్ కొన్ని దశాబ్దాలుగా దక్షిణాది చిత్రాలకే పరిమితమైనా… గత యేడాది బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడా గ్రాండ్ సక్సెస్ ను సాధించింది. షారుక్ ఖాన్ సరసన నయన్ నటించిన ‘జవాన్’ చిత్రం వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అలా ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, నేషనల్ వైడ్ రికగ్నైజేషన్ సంపాదించుకున్న నయన్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ధనుష్ సరసన హీరోయిన్ గా నటించిన ఏడేళ్ళకు నయనతారకు ఆయన సంస్థ నుండి పిలుపొచ్చింది. ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీలో హీరోయిన్ గా నటించమని ధనుష్ కోరాడు. దానికి విఘ్నేష్ శివన్ డైరెక్టర్. విజయ్ సేతుపతి హీరో. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాతే నయన్, విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమ చిగురించి… ఆపైన వారి పెళ్ళకి దారితీసింది. అయితే… ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీ సమయంలోనే ధనుష్, నయన్ పట్ల కొంత కోల్డ్ వార్ జరిగినట్లు తెలుస్తోంది. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా తెలుగులోనూ ‘నేను రౌడీ’ పేరుతో డబ్ అయ్యింది.
‘నానుమ్ రౌడీ దాన్’ మూవీ షూటింగ్ టైమ్ లో సెట్స్ కు నిర్మాతగా వచ్చిన ధనుష్… నయన తార నటనపై అనేక వంకలు పెట్టేవాడట. ఆ సినిమా ఆడియో వేడుకలోనూ అతను ఆమె గురించి రకరకాల వ్యాఖ్యాలు చేశాడట. తాజాగా వివాదంలో నయనతార వాటిని కూడా తల్చుకుంది. ధనుష్ బ్యానర్ లో సినిమా చేసినప్పుడు అతని ప్రవర్తన, అతను చేసిన విమర్శలు చాలా బాధకు గురిచేశాయని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. చిత్రం ఏమంటే… నయనతార మొదటి నుండీ ఏ విషయాన్ని తన మనసులో దాచుకునే రకం కాదు.. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలో నటనకు గానూ నయనతారకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. దానిని అందుకునే సమయంలో వేదికపై ధనుష్ సమక్షంలోనే ఇందులోని నా నటన ధనుష్ కు నచ్చలేదు. ఇప్పుడేమో ఈ అవార్డ్ నాకు వచ్చింది. రాబోయే రోజుల్లో ఆయనకు నచ్చేలా నటించడానికి ప్రయత్నిస్తాను అని గూబ గుయ్ మనేలా రిటార్ట్ ఇచ్చింది.