Jharkhand: జార్ఖండ్‌లో 28న హేమంత్ సోరెన్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హేమంత్ సోరెన్ ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను కూడా కలిశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌కు మరో పెద్ద షాకే వచ్చింది. జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం పదవి లభించదని తెలుస్తోంది. JMM ఈ పోస్ట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థనే కొనసాగుతుందని హేమంత్ సోరెన్ కాంగ్రెస్‌కు స్పష్టంగా చెప్పినట్లు రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి.
Jharkhand: జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం పదవి రాకపోవచ్చు కానీ.. కచ్చితంగా 4 మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. 4 మంత్రుల పదవి కోసం ఎక్కువగా ప్రచారంలో ఉన్న పేర్లలో రామేశ్వర్ ఒరాన్, దీపికా పాండే సింగ్, ఇర్ఫాన్ అన్సారీ, అనూప్ సింగ్, శ్వేతా సింగ్ ఉన్నారు. ఇందులో మొదటి ముగ్గురు నేతలు కూడా హేమంత్ సోరెన్ గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. నాలుగో పేరు విషయంలో పార్టీలో చర్చలు నడుస్తున్నాయి.