కడప మేయర్ సురేష్‌బాబుపై రాష్ట్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మేయర్ తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు అప్పగించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మేయర్ సురేష్‌బాబు తన కుటుంబానికి చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు మున్సిపల్ పనులు అప్పగించారని ఆరోపణలపై కడప ఎమ్మెల్యే మాధవి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 28న మేయర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘‘మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు నిన్ను ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో వివరణ ఇవ్వాలి’’ అని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొంది.
సురేష్‌బాబు ఆ నోటీసును హైకోర్టులో ల్లించి, వివరణకు గడువు కోరారు. హైకోర్టు రెండుసార్లు గడువు ఇచ్చినా, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎదుట హాజరై ఇచ్చిన వివరణ ప్రభుత్వాన్ని సంతృప్తి పరచలేకపోయింది .
దీంతో తుది నిర్ణయంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేయర్ సురేష్‌బాబుపై అనర్హత వేటు వేసింది. ప్రజా ప్రతినిధిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే కారణంతో ఈ చర్య తీసుకుంది.
మరింత kadapa: మేయర్ పై అనర్హత వేటు