Btech Ravi: గత ప్రభుత్వ హయాంలో పులివెందుల నియోజకవర్గం లో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపించారు పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.వైయస్ కుటుంబానికి చెందిన వ్యక్తి కొండూరు మండలంలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా 50 వేలతో కొన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వ భూమిని నిబంధనలకు కొనడం ఏంటని ప్రశ్నించారు.గత ఐదేళ్లలో వారే యదేచ్చగా భూములను ఆక్రమించి టిడిపి పై ఆర్డీవో కు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.భూ ఆక్రమణల పై తొందరలో రెవెన్యూ శాఖ మంత్రికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తాం అన్నారు.