Ar rehaman: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కడప జిల్లాలో పర్యటించారు.తన కుటుంబ సభ్యులతో కలిసి కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. పెద్ద దర్గా ఉత్సవాల్లో ప్రధానమైన గంధ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దర్గా పీఠాధిపతి తన శిష్యగణంతో కలిసి కలశాన్ని తీసుకువచ్చారు. ప్రతియేటా అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తుల బారి ఎత్తున హాజరయ్యారు.
గంధ మహోత్సవంలో ఏఆర్ రెహమాన్ పాల్గొనడంతో అభిమానులు పోటెత్తారు. దర్గా పరిసర ప్రాంతాలు భారీగా జనాలతో నిండిపోయింది. కడప దర్గా ఉరుసు ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు.