Ap News: దుండగులను జైలు పాలు చేస్తున్నా.. శిక్షలు కఠినంగా వస్తున్నా.. దారుణాలు మాత్రం ఆగడం లేదు. మహిళల పట్ల ఈ దారుణాలు మితిమీరి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ, అక్కడ అని కాకుండా ఎక్కడ పడితే అక్కడ మహిళలపై అకృత్యాలు నిత్యకృత్యమవుతున్నాయి. దానవులుగా మారుతున్న కొందరి వికృత చేష్టలకు ఎందరో అబలలు తనువులు చాలిస్తున్నారు. అయిన వారికి దూరమవుతున్నారు. మహిళల మాన, ప్రాణాలకు రక్షణ.. అందని ద్రాక్షగానే అనుకోవాలా? అన్నట్టుగా సమాజంలో విపరీతాలు చోటుచేసుకుంటుండటం ఆందోళనకరం.
Ap News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణంపై సభ్యసమాజం తలదించుకోవాల్సి వస్తున్నది. కడప జిల్లా కాశినాయన మండలం కత్తెరగండ్లలో ఓ మహిళపై దుండగులు లైంగికదాడి చేసి, వివస్త్రను చేసి బండరాయితో మోది హత్య చేశారు. మృతురాలిది చాపాడు మండలం ఖాదర్ పల్లెకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ దారుణ ఘటనపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దుండగులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.