Crime News: అలా స్వేచ్ఛ ఇస్తే ఇలానే జరుగుతుంది. చేతిలో గన్ను , ఎదురుగ్గా మనుషులు. ఎవడికైనా ఏమి అనిపిస్తుంది. అందులోను గన్ గేమ్ ఆటలు అలవాటు ఉంటె. ఫటా ఫటా కాల్చి పడేస్తాడు. లానే చేతిలో గన్నుతో…గాల్లో కాకుండా క్లాస్ గదిలో కాల్చేశాడు ఆ కుర్రాడు. ఇంకేముంది …పది మందికి పైగా స్టూడెంట్స్ చనిపోయారు. పాపం కదా ..మారాలి …వ్యవస్థే మారాలి. అప్పుడే …ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్
స్వీడన్‌లోని ఒక పాఠశాలలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించింది. ఒరెబ్రో నగరంలోని ఒక పాఠశాల ఆవరణలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది మరణించారు. ఈ సంఘటన స్వీడన్ చరిత్రలో అత్యంత దారుణమైన కాల్పుల ఘటనగా భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం, కాల్పులు జరిపిన దుండగుడు మరణించిన వారిలో ఉన్నాడు. ఒరెబ్రో నగరంలోని జిల్లా పోలీసు అధికారి రాబర్టో ఈద్ ఫారెస్ట్ ప్రకారం, కాల్పుల్లో అనేక మంది గాయపడ్డారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున బాధితుల ఖచ్చితమైన సంఖ్యను ఇంకా నిర్ధారించలేకపోతున్నాన్నారు. బాధితుల కోసం పోలీసులు ఇప్పటికీ పాఠశాల ఆవరణలో గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దుండగుడు ఒంటరిగా ఈ కాల్పులు జరిపాడని తెలిపారు. దాడి తర్వాత అతను కూడా చనిపోయాడని తేలింది. కాల్పులు జరిపిన దుండగుడికి ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. అలాగే ముఠాతో సంబంధం లేదు. ప్రస్తుతం, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పుల ఘటనకు సంబంధించి దుండగుడి ఉద్దేశ్యం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కు తీవ్ర అనారోగ్యం
ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నామని ఉపాధ్యాయులు తెలిపారు. హఠాత్తు పరిణామంతో తరగతి గదుల నుంచి పిల్లలతో సహా బయటకు పరుగులు తీశామన్నారు. ఇప్పటివరకు, కనీసం 10 మంది కాల్పుల్లో మరణించినట్లు నిర్ధారించారు అయితే ఆ సంఖ్య గురించి మరిన్ని వివరాలు చెప్పలేమని పోలీసులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. స్వీడన్ న్యాయ మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.
ఒరెబ్రో పోలీసు చీఫ్ రాబర్టో ఈద్ ఫారెస్ట్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. “తుపాకి దాడి చేసిన వ్యక్తి పోలీసులకు తెలియదన్నారు రాబర్టో. అతనికి ఏ ముఠాతోనూ సంబంధాలు లేవన్న ఆయన.. నిఘా వర్గాల సహకారంతో కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

