Surya: ప్రముఖ నటుడు సూర్య ‘అన్ స్టాపబుల్’ షోలో సందడి చేశారు. గురువారం తన సినిమా ‘కంగువా’ ప్రచారానికి వచ్చిన సూర్య తన సినిమా యూనిట్ తో కలసి అన్నపూర్ణ స్డూడియోస్ లో బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో పాల్గొన్నారు. బాలయ్య హోస్ట్ గా వ్యవరిస్తున్న ఈ షో నాలుగవ సీజన్ తొలి ఎపిసోడ్ 25న ప్రసారం కానుంది. అందులో ఎపి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది. ఇక గత మూడు సీజన్స్ లో ఈ టాక్ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా పేరు తెచ్చుకోవడం విశేషం. ఈ సీజన్ లో పలువురు ప్రముఖులు ఈ షోలో సందడి చేయబోతున్నట్లు వినిపిస్తోంది. ఇక సూర్య నటించిన ‘కంగువా’ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. అందుకోసం నార్త్ లో ప్రచారం నిర్వహించిన సూర్య అండ్ కో ఇప్పుడు సౌత్ మీద దృష్టి పెట్టింది. మరి ‘అన్ స్టాపబుల్’లో బాలయ్య సూర్య ఆడియన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి.
