Kanguva Review

Kanguva Review: ‘కంగువా’ మూవీ రివ్యూ

Kanguva Review: సూర్య సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యి… చాలా కాలమే అయ్యింది. దాంతో ఎప్పుడెప్పుడు తమ హీరోను సిల్వర్ స్క్రీన్ మీద చూడగలమా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. నవంబర్ 14న వచ్చిన ‘కంగువ’తో ఆ కోరికకు తెర పడింది. మరి వాళ్ళంతా ఎంతోకాలంగా పెట్టుకున్న ఆశలు ఏ మేరకు నెరవేరాయో చూద్దాం.

Kanguva Review: కంగువ… ప్రస్తుతం నుండి… వెయ్యేళ్ళ వెనక్కి వెళ్ళే కథ. డబ్బులు తీసుకుని పోలీసలుకు అన్ అఫీషియల్ గా సాయం చేస్తుండే ఫ్రాన్సిస్ (సూర్య) దగ్గరకు ఓ చిన్న కుర్రాడు వస్తాడు. అతన్ని చూసినప్పటి నుండి తమ మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉందని ఫ్రాన్సిస్ ఫీలవుతూ ఉంటాడు. గోవాకు వచ్చిన ఆ కుర్రాడిని వెతుక్కుంటూ ఇంటర్నేషనల్ ముఠా ఒకటి రంగంలోకి దిగుతుంది. ఆ పిల్లాడి ఎత్తుకెళుతుంటే… ఫ్రాన్సిస్ రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలోనే అతనికి తన గత గుర్తొస్తుంది. అక్కడి నుండి కథ వెయ్యేళ్ళ వెనక్కి వెళుతుంది. ఒకే దగ్గర ఉండే ఐదు ద్వీపాలలో ఒకదానికి కంగువ తండ్రే అధిపతి. పరాయి దేశాల నుండి తమను దోచుకోవడానికి వచ్చిన వారిని కంగువ నిలువరిస్తాడు. దాంతో తమ పక్కన ద్వీపాల వారే కంగువను ఎదురించే ప్రయత్నం చేస్తారు. ఈ పోరాటంలో కంగువ ఏ మేరకు విజయం సాధించాడు? ఓ పిల్లాడి రక్షించే క్రమంలో కంగువ అతనికి ఇచ్చిన మాట ఏమిటీ? దానిని నిలబెట్టుకోవడానికి వెయ్యేళ్ళ తర్వాత వీరు తిరిగి జన్మించినప్పుడు ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ.

Kanguva Review:  సినిమా ప్రారంభంలో బౌంటీ హంటర్ గా ఫ్రాన్సిస్ చేసే ఓవర్ యాక్షన్ ను తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అలానే అతనితో స్వీట్ రివేంజ్ తీర్చుకునే మాజీ ప్రియురాలు ఏంజెలీనా గ్లామర్ కూడా కాస్తంత వెగటు పుట్టిస్తుంది. దీనికి తోడు యోగిబాబు, రెడిన్ కింగ్ స్లే కామెడీతో చికాకు తెప్పిస్తారు. వీటిని కాస్తంత భరించిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ నుండి సినిమా ఆసక్తికరంగా ముందుకు వెళ్ళింది. కంగువ గా సూర్య ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి ప్రేక్షకులను వెయ్యేళ్ళ వెనక్కి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిపోతాడు దర్శకుడు శివ. అయితే… ఐదు ద్వీపాల మధ్య ఉండే అంతర్గత తగవులు, గొడవలు, యుద్థాలు చూస్తుంటే… ఇటీవల వచ్చిన ‘దేవర’ మూవీ గుర్తొస్తుంది.

Kanguva Review: వెట్రిపళని సామి తన కెమెరా పనితనంతోనూ, దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతంతోనూ మూవీలోని సన్నివేశాలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పారెస్ట్ అండ్ సీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ మెస్మరైజింగ్ గా ఉన్నాయి. కొడుకు కాని కొడుకుతో సూర్యకు ఏర్పడే అనుబంధమే ఈ సినిమాకు ఆయువు పట్టు. అయితే… దానిని ఆడియెన్స్ కు ప్టటేలా తీయడంలో దర్శకుడు శివ విఫలమయ్యాడు. యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నా… ఓవర్ ఆల్ గా చూసినప్పుడు… ఆత్మ ఎక్కడో మిస్ అయిపోయిన భావన కలుగుతుంది.

ALSO READ  Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ

Kanguva Review: సినిమా పూర్తయ్యే టైమ్ కి కార్తీ ఎంట్రీ ఇచ్చి… కొంత ఊపును తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ‘కంగువ’ సీక్వెల్ లో అన్నదమ్ములైన సూర్య, కార్తి మధ్యనే ప్రధాన పోరాటం ఉంటుందని దర్శకుడు తేల్చి చెప్పేశాడు. అయితే… నిజానికి ఆ పనేదో ఈ సినిమాలోనే చేసి ఉంటే… ‘కంగువ’కు మంచి క్రేజ్ ఉండేది. అలానే రెండో భాగం తీయాల్సిన పని తప్పేది.
నటీనటుల విషయానికి వస్తే…. ఫ్రాన్సిస్ గా, కంగువగా రెండు భిన్నమైన పాత్రలను సూర్య పోషించాడు. అందులో ఫ్రాన్సిన్స్ చెప్పుకునేంత గొప్పగా లేకపోయినా కంగువ కోసం సూర్య ప్రాణాలు పెట్టాడనిపిస్తుంది. అతని కష్టం తెర మీద కూడా కనిపిస్తోంది. దిశా పటానిని తలుచుకుంటే జాలి కలుగుతుంది. మొన్నొచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ లానే ఇందులోని పాత్ర కూడా ఉంది. కాకపోతే ఒకటి రెండు యాక్షన్ సీన్స్ పెట్టారు. మిగిలిన నటీనటుల హావభావాలకంటే… వారి ఆహార్యానికే మేకర్స్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బాబీ డియోల్ పాత్ర కూడా కేటగిరికి చెందిందే. డిఫరెంట్ కాస్ట్యూమ్స్, మేకప్ కారణంగా చాలామంది ఆర్టిస్టులను గుర్తు పట్టడం కూడా కష్టమే.

Kanguva Review: ‘కంగువ’ సినిమాను కె.ఈ. జ్ఞానవేల్ రాజాతో పాటు ప్రమోద్, వంశీ నిర్మించారు. నిర్మాణ పరంగా ఎక్కడా వంక పెట్టడానికి లేదు. కోట్లు గుమ్మరించారు. అయితే దానికి తగ్గ ఫలితం ఏమేరకు వస్తుందనేది సందేహమే. దర్శకుడు శివకు ఇది పదో చిత్రం. పీరియాడిక్ పోర్షన్ ను అద్భుతంగా తీసినా… తగిన విధంగా సెంటిమెంట్ ను పండించలేకపోయాడు శివ. దాంతో ‘కంగువ’ కేవలం యాక్షన్ ప్రియులకు మాత్రమే నచ్చే సినిమాగా మారిపోయింది. మరి ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్ ఏమేరకు వస్తుందనేది వేచి చూడాలి.

రేటింగ్: 2.25/ 5
అంచనాలు అందుకోని ‘కంగువ’

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *