Khaidi 2: మిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ పేరు వినగానే ఆయన తీసిన ‘ఖైదీ, విక్రమ్, లియో’ సినిమాలు గుర్తుకు వస్తాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తో తీస్తున్న ‘కూలి’ సినిమా కూడా లోకేశ్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ లో భాగమే. ఆ తర్వాత తీయబోయే సినిమాలు కూడా ఆ యూనివర్శ్ లో భాగం అవుతాయని తెలియచేశాడు. రజనీతో తీస్తున్న ‘కూలి’ తర్వాత కార్తీ తో ‘ఖైదీ2’ని ఆరంభించనున్నాడు లోకేశ్ కనకరాజ్. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన హీరోలందరూ ‘ఖైదీ2’లో కనిపిస్తారట. అంటే రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, కార్తీ, ఫాహాద్ ఫాజిల్ అందరినీ ఈ సినిమాలో చూడబోతున్నామట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ కి ఆ యా హీరోల ఫ్యాన్స్ అందరూ ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. ఇంత మందికి సరిపడేలా అందరినీ ఇన్ వాల్వ్ చేస్తూ స్క్రిప్ట్ తయారు చేయటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక ఖైదీ2 రెగ్యులర్ షూటింగ్ 2025లో మొదలు పెడతారట. ‘ఖైదీ’ కి ప్రీక్వెల్ గా డిల్లీ పాత్రధారి కార్తీ జర్నీ, జైలుకు వెళ్ళి బయటకు రావటం తదితర అంశాలు చోటుచేసుకుంటాయట. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
