Suravaram Sudhaker Reddy: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ దివంగత సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధనల నిమిత్తం అప్పగించనున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆగస్టు 22న సురవరం తుది శ్వాస విడిచారు. ఇప్పటివరకు ఆయన పార్థివదేహాన్ని కేర్ ఆసుపత్రిలోనే ఉంచారు. ఈ రోజు (ఆగస్టు 24) ఆయన పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర సమితి కార్యాలయమైన మఖ్ధూంభవన్‌కు తరలిస్తారు.
Suravaram Sudhaker Reddy: మఖ్ధూంభవన్‌లో ఆగస్టు 24న ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా వివిధ రాజకీయ పక్షాల నాయకులు, వామపక్ష శ్రేణులు, ఇతర రంగాల ప్రముఖులు సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులర్పించనున్నారు. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటల అనంతరం సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం పార్థివదేహాన్ని తరలిస్తారు.
Suravaram Sudhaker Reddy: హిమాయత్‌నగర్ మఖ్ధుంభవన్ నుంచి మెడికల్ కాలేజీ వరకు సురవరం పార్థివదేహంతో భారీ ర్యాలీతో సీపీఐ శ్రేణులు, అభిమానులు తరలివెళ్తారు. నాయకులు, కార్యకర్తలు ఎర్ర చొక్కాలు ధరించి రావాలని, మహిళా కార్యకర్తలు ఎర్ర చీరలు ధరించి రావాలని సీపీఐ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ర్యాలీ అనంతరం గాంధీ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని అప్పగించనున్నారు.