Supreme court: మనలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు.. డొక్కలెండిన జంతువులను చూసి అయ్యేపాపం అని అనుకుంటూ ఉంటారు. కొందరు ఏకంగా ఆహార పదార్థాలను తీసుకొచ్చి పెడుతుంటారు. మరికొందరు తన నెలవారీ సంపాదన నుంచి కొంత అలాంటి జంతువుల కోసం ఖర్చు పెడుతూ సంతృప్తి పొందుతూ ఉంటారు. కానీ, ఇక్కడ వీధి కుక్కలకు ఆహారం పెట్టే ఓ వ్యక్తికి న్యాయస్థానాల్లో చుక్కెదురైంది. అదేమిటో చూద్దాం రండి..
Supreme court: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి తరచూ వీధి కుక్కలకు రోడ్డుపై ఆహారం పెడుతుండేవారు. అయితే రోడ్డుపై వెళ్లేవారికి, సమీపకులకు ఇబ్బందులున్నాయని, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఆ వ్యక్తి అలహాబాద్ కోర్టు మెట్లెక్కాడు. అయితే వీధికుక్కలు వాకింగ్ చేస్తున్నవారిని, వాహనదారులపై దాడులు చేస్తున్నాయని, కొందరి ప్రాణాలు తీశాయని కోర్టు పేర్కొన్నది.
Supreme court: అంతగా వీధి కుక్కలపై ప్రేమ ఉంటే మీ ఇంటిలోనే షెల్టర్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. దీనిపై ఆశ్చర్యపోయిన ఆ నోయిడా వ్యక్తి అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ, సుప్రీంకోర్టు మెట్లెక్కారు. విచారణ అనంతరం అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, వీధి కుక్కల వల్ల ప్రాణాలు పోతున్నాయని, అవసరమైతే వీధికుక్కలకు మీ ఇంట్లోనే ఆహారం పెట్టుకోండి.. అంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అంటే పుణ్యానికి పోతే పాపం అడ్డొచ్చిందన్న సామెత.. దీనికి సరిపోకున్నా.. నష్టం మిగిలిస్తున్నదన్న మాట.