Supreme Court Of India: సుప్రీంకోర్టులో ఈ రోజు (అక్టోబర్ 6న) హఠాత్ పరిణామం చోటుచేసుకున్నది. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పైనే ఓ లాయర్ దాడికి యత్నించిన ఘటన జరిగింది. ఈ ఘటనతో అంతా అవాక్కయ్యారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఓ కేసును విచారిస్తుండగా, ఈ దుర్ఘటన జరిగింది. తన బూటుతో ఆ లాయర్ దాడికి యత్నించగా, వెంటనే భద్రతా సిబ్బంది గుర్తించారు. అతడిని వెంటనే బయటకు లాక్కెళ్లారు. సనాతన ధర్మాన్ని కించపరిచేవారిని వదిలి పెట్టబోమని ఆ లాయర్ గట్టిగా అరవడం గమనార్హం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.
