తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. నోటీసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఎందుకంటే.. ఫోన్ టైపింగ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడంతో తాజాగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 27కి వాయిదా వేసింది.

