Supreme Court: ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విజయ్‌పాల్‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. అతని వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, అనుచితమైనవిగా సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గవాయ్ అభివర్ణించింది.
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల సోదరి అని విజయ్‌పాల్‌ను అన్నందుకు ఆయనపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని మధ్య ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. గురువారం (మే 15) సాయంత్రంలోగా కేసు నమోదు చేయాలని లేదంటే కోర్టు ధిక్కారం కింద డీజీపీపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.
Supreme Court: హైకోర్టు ఆదేశాల మేరకు మంత్రి విజయ్ పాల్‌పై మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని మోవ్‌లోని మన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలో మంత్రి విజయ్ పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Supreme Court: రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు బాధ్యత ఉండక్కర్లేదా? అంటూ మంత్రి విజయ్‌పాల్‌పై సుప్రీంకోర్టు మందలించింది. తమ ప్రసంగాల్లో సంయమనం పాటించాలని హెచ్చరించింది. కల్నల్ సోఫియాకు క్షమాపణలు చెప్పాలని, కాస్త వివేకం చూపాలని హెచ్చరించింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు విజయ్‌పాల్ పిటిషన్‌ను నిరాకరించింది.

