Rajinikanth: గత కొద్ది రోజులుగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్టార్స్ అంతా విషెస్ చెప్తున్నారు. బాక్సాఫీస్ బరిలో కూలీతో కలెక్షన్స్ కుమ్మేస్తున్నారు. రజినీ వర్కౌట్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
Also Read: SSMB 29: టాంజానియా అడవుల్లో.. మహేష్ – ప్రియాంక పిక్ వైరల్..
తలైవా 74 ఏళ్ల వయసులోనూ హుషారుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నారు. ఆగస్టు 14న రిలీజ్ అయిన కూలీ రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుంది. రజినీ డైట్ ఫాలో అవుతారు. పాజిటివ్ థింకింగే తన హెల్త్ సీక్రెట్ అని చెప్తుంటారు. తలైవా, ట్రైనర్ సాయంతో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి రీసెంట్ గా వైరల్ అవుతోంది. ఈ ఏజ్ లోనూ ఫిట్ నెస్ విషయంలో మీరు తీసుకుంటున్న శ్రద్ధ ఎందరికో ఆదర్శం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Unseen video of Rajini’s workout pic.twitter.com/tpgufLkTzM
— Kollywood Talks 𝕏 (@kollywoodtalks) August 14, 2025

