Coolie

Coolie: నో టీజర్.. నో ట్రైలర్.. ఇదేం ట్విస్ట్ రా మావా..

Coolie: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మెయ్యాలి డ్యూట్ అన్నట్టు.. తలైవా అలా స్టైల్ గా నడుచుకుంటూ వచ్చినా, చిన్న స్మైల్ తో ఓ లుక్ ఇచ్చినా సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోతుంది. థియేటర్లు దద్దరిల్లిపోతాయ్.. జైలర్ తో ట్రాక్ లోకొచ్చిన రజినీ.. టాలెంటెడ్ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిలిం కూలీ, హెవీ స్టార్ కాస్టింగ్ అండ్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.. నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి బిగ్ స్టార్స్ అందరూ తెరమీద కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి మరి..
జూలై 24 నుండి యూఎస్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యబోతున్నట్టు అనౌన్స్ చేశారు.

Also Read: Nayanthara: రివెంజ్ టైం అంటున్న కోలీవుడ్‌.. న‌య‌న‌తార‌కి లీగల్ నోటీసులు పంపించిన నిర్మాత‌లు

ఇదిలా ఉంటే.. ఎలాగో పెద్ద స్టార్స్ ఉన్నారు కదా.. ఇంక కొత్తగా ప్రమోషన్ ఎందుకు అనకుని.. ట్రైలర్ లేకుండానే డైరెక్ట్ సినిమా రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట సన్ పిక్చర్స్ యాజమాన్యం.. ట్రైలర్ అనేది లంచ్ కి ముందు సూప్, సలాడ్ లాంటిది అనుకుందాం.. మరి ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ పెంచడానికి ట్రైలర్ రిలీజ్ చెయ్యాల్సిందే.. ఇప్పటివరకు టీజర్ కూడా వదల్లేదు.. పోస్టర్స్, ఓ సాంగ్ మాత్రమే కనిపించాయి. జూలై నెలాఖరున చెన్నై నెహ్రు స్టేడియంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ వేడుకలో టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉందా అనేది చూడాలి. అలాగే, ఆగస్ట్ 7న హైదరాబాద్ లో కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *