Sunrisers Hyderabad: ఇంగ్లాండ్ దేశవాళీ ధనాధన్ టోర్నీ హండ్రెడ్ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వరుసగా ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే ముంబయి, లఖ్ నవూ సూపర్ జెయింట్స్ ప్రవేశించగా, తాజాగా మరో ఐపీఎల్ టీమ్ కూడా ప్రవేశించింది. నార్తర్న్ సూపర్ చార్జర్స్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ భాగస్వామి అయింది. ఈ ఫ్రాంఛైజీలో 49 శాతం వాటాను సన్ గ్రూప్ సొంతం చేసుకుంది. దీని ద్వారా, ‘హండ్రెడ్ లీగ్‌లో వాటా కొనుగోలు చేసిన మూడో ఐపీఎల్ జట్టు యాజమాన్యంగా సన్ గ్రూప్ నిలిచింది.
హండ్రెడ్ లీగ్ కి సంబంధించిన బిడ్డింగ్‌లో గెలుపొందిన సన్ గ్రూప్, నార్తర్న్ సూపర్ చార్జర్స్‌లో 49 శాతం వాటాను దాదాపు 100 మిలియన్ బ్రిటిష్ పౌండ్లకు సొంతం చేసుకుంది. ఇది భారతీయ కరెన్సీలో రూ.1092 కోట్లు. సన్ గ్రూప్, ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు, సౌతాఫ్రికా టి20 లీగ్‌లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ను నిర్వహిస్తోంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: కిచక టీచర్స్.. 13 ఏళ్ల విద్యార్ధి పై అత్యాచారం..
ఇక ఈ కొనుగోలుతో, సన్ గ్రూప్ ఖాతాలో మూడో జట్టు చేరింది. అలాగే, ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు సంబంధించిన వ్యవహారాలను కావ్య మారన్ చూసుకుంటోంది. ఇక హండ్రెడ్ లీగ్ విషయానికి వస్తే… రీసెంట్‌గా లఖ్నవూ సూపర్ జెయింట్స్ యాజమాన్యం మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో వాటా కొనుగోలు చేయగా, అంతకుముందు ముంబయి ఇండియన్స్ కు చెందిన రిలయన్స్ యాజమాన్యం ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టులో వాటా కొనుగోలు చేసింది.
ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నార్తర్న్ సూపర్ చార్జర్స్‌లో భాగస్వామి అయింది. దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం జీఎంఆర్ గ్రూప్ కూడా హండ్రెడ్ లీగ్‌లోని సదరన్ బ్రేవ్‌లో వాటా కొనుగోలు చేయాలనుకుంటోంది అని సమాచారం. మరి ఇప్పటికే SA20 లీగ్ లో అన్నీ జట్లను కొనుగోలు చేసిన ఐపీఎల్ జట్లు హండ్రెడ్ లో కూడా తమ ముద్ర వేయాలని చూస్తుండడం మంచి పరిణామమే..!