Sunil Gavaskar: భారత సీనియర్ స్టార్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ,.కేఎల్ రాహుల్ ల పైన టీమిండియా దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ తాజాగా పొందుపరిచిన నియమాలను వారు ఉల్లంఘించారు అంటూ సునీల్ గవాస్కర్ మాట్లాడడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న రంజీ టోర్నమెంట్ నుండి వారు ఉద్దేశపూర్వకంగానే తప్పుకున్నారు అన్నది సునీల్ గవాస్కర్ ఆరోపణ. ఈ వివరాల్లోకి వెళితే.
భారత దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఎంతటి పెద్ద బ్యాట్స్మెన్ పైన అయినా విమర్శలు చేసేందుకు వెనుకాడరు. కామెంటరీ లో, మీడియా ముందు అతని అభిప్రాయాలు ఎప్పుడూ వివాదాస్పదం అవుతుంటాయి
ముఖ్యంగా భారత్ ప్లేయర్ల కమిట్మెంట్ విషయమై తరచూ సందేహాలు వ్యక్తం చేసే సునీల్ గవాస్కర్ ఇప్పుడు ఇద్దరు స్టార్ ప్లేయర్లపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల కాలంలో టెస్టులలో ఘోరంగా విఫలమైన భారత ఆటగాళ్ళకు బిసిసి కొత్త నియమాలు విధించింది. సిరీస్ లు ఆడే సమయంలో ఆటగాళ్ల కుటుంబాలను వారికి దూరంగా ఉంచే దగ్గర నుండి వీలున్నప్పుడల్లా రంజి మ్యాచ్ లు ఆడేలా కొన్ని కొత్త నిబంధనలు తీసుకొని వచ్చింది. వీటికి అనుగుణంగానే రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్,. శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా తమ తమ జట్ల తరపున రంజీ మ్యాచ్ లలో ప్రాతినిధ్యం వహించారు.
ఇది కూడా చదవండి: India vs England T20 Series: ఇంగ్లాండ్ పై భారత్ ఓటమి!
Sunil Gavaskar: అయితే కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మాత్రం రంజీ ట్రోఫీ చివరి రౌండుకు అందుబాటులో లేరు. ఇందుకు కారణంగా తమకు గాయాల బెడద ఉందని వారు చెప్పడం గమనార్హం. అయితే దీనిపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ… మిగిలిన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడుతుంటే వీరు ఇలా తప్పించుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఒక ఆటగాడు గనుక గాయం పాలైతే బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే జాతీయ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.
ఉదాహరణకు గాయం కారణంగా ఇంగ్లాండ్ టి20 సిరీస్ నుండి తప్పుకున్న నితీష్ కుమార్ రెడ్డి వెంటనే ఎంసీఏ అనగా నేషనల్ క్రికెట్ అకాడమీ కు రిపోర్ట్ చేశాడు. అక్కడివారు అతనికి కావలసిన శిక్షణ, వైద్యం అందించి మరలా ఫిట్ గా తయారుచేస్తారు. కోహ్లీ, కేఎల్ రాహుల్ లతోపాటు సిరాజ్ కూడా గాయాల బెడద కారణంగానే చివరి రౌండు రంజి మ్యాచ్ లు ఆడడం లేదు. ఇక వీరిపై గవాస్కర్ కొంచెం తీవ్రంగానే విమర్శలు చేశాడు.
బిసిసిఐ నియమాలను వీరు కావాలని ఉల్లంఘిస్తున్నారు అని… నిజంగా వీరికి గాయాలు బెడద ఉంటే వెంటనే నేషనల్ క్రికెట్ అకాడమీ కు రిపోర్ట్ చేయాలి అని కానీ అలా జరగలేదు అన్నది అతను వాదన. అయితే దీనిపై బిసిసిఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న విషయంపై కూడా తను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని గవాస్కర్ చెప్పాడు. కానీ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్న చిన్న గాయం తీవ్ర పెరుగుతుంది అనో లేదో మరలా పునరావృతం అవుతుందో అన్న ముందస్తు జాగ్రత్త చర్యగా రంజీ మ్యాచ్లలో పాల్గొనకపోవడం కూడా కారణం కావచ్చు. మరి ఈ వివాదం చివరికి ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.

