Anaganaga

Anaganaga: సుమంత్ ‘అనగనగా’ థియేటర్లలో సందడి.. కల్ట్ క్లాసిక్‌కు అదిరిపోయే స్పందన!

Anaganaga: తెలుగు సినిమా పరిశ్రమలో నాణ్యమైన చిత్రాలకు పెట్టింది పేరు హీరో సుమంత్. ఆయన నటించిన తాజా చిత్రం ‘అనగనగా’ ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను గుండెల్ని తడమగలిగింది. ఓటీటీలో సంచలన రెస్పాన్స్ తో ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలోకి అడుగుపెడుతోంది.

విశాఖపట్నం, విజయవాడలో ఈటీవీ విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఉచిత ప్రదర్శనలకు అనూహ్య స్పందన లభించింది. ఈ విజయంతో సుమంత్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ వారం నుంచి అదనపు స్క్రీన్‌లలో ‘అనగనగా’ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఓటీటీలో వచ్చిందేమిటని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

Also Read: Bhairavam: మెగా అభిమానుల ఆగ్రహం.. ‘భైరవం’ సినిమాపై బాయ్‌కాట్ ట్రెండ్!

సుమంత్ తన సంతోషాన్ని పంచుకుంటూ, ఈ సినిమాకు వస్తున్న ఆదరణ తనను ఉత్తేజపరిచిందని తెలిపారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శేఖర్ కమ్ముల స్థాయిలో కల్ట్ క్లాసిక్‌లు అందించే సుమంత్, ‘అనగనగా’తో మరోసారి తన ప్రతిభను నిరూపించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *