Sukumar-Prabhas: టాలీవుడ్లో ఇప్పుడు నిర్మాతల మధ్య దర్శకుడు సుకుమార్ కోసం ఒక ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. బ్లాక్ బస్టర్ ‘ఆర్య’ సినిమాతో సుకుమార్‌ను పరిచయం చేసిన దిల్ రాజు, దాని తర్వాత అతడితో మళ్లీ సినిమా చేయలేదు దిల్ రాజు. దీనికి కారణం వారి మధ్య ఉన్న క్రియేటివ్ డిఫరెన్స్ అని తెలుస్తోంది.
అయితే, ఇప్పుడు దిల్ రాజు మళ్లీ సుకుమార్‌ను తన బ్యానర్లోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్‌తో ఒక భారీ ప్రాజెక్ట్‌ను సెట్ చేయాలని దిల్ రాజు అనుకుంటున్నారు.
#Sukumar made his debut with the blockbuster Arya under #DilRaju’s banner. Since then, they never reunited due to creative differences.
Dil Raju is keen to bring Sukumar & #Prabhas together for a massive project. But Mythri Movie Makers want to keep Sukumar exclusive with… pic.twitter.com/L2ldIebUDI
— Filmyscoops (@Filmyscoopss) October 20, 2025
మరోవైపు, మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం సుకుమార్‌ను తమ బ్యానర్‌కే పరిమితం చేయాలని చూస్తున్నారు. సుకుమార్ ప్రస్తుతం తన తదుపరి సినిమాను రామ్ చరణ్‌తో ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే ‘పుష్ప 3’ చేయాలని మైత్రీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, సుకుమార్-దిల్ రాజు-ప్రభాస్ కాంబినేషన్ ఇప్పటిలో వచ్చే ఛాన్స్ లేనట్టే అని తెలుస్తుంది.
అల్లు అర్జున్ అట్లీ సినిమా తరువాత ఇంకో సినిమా తో బిజీగా ఉంది సుకుమార్ కి డేట్స్ ఇవ్వకపోతే, ఈ సినిమాని లైన్ లోకి తీసుకోని వస్తారా లేక పుష్ప-3 స్క్రిప్ట్ మీద కూర్చుంటాడా అనేది చూడాలి.