Sudha murthy: ఇటీవల సైబర్ నేరగాళ్లు ప్రముఖ వ్యక్తులపై మోసానికి ప్రయత్నిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి మరియు చిక్కబళ్లాపూర్ బీజేపీ ఎంపీ కె. సుధాకర్ భార్య ప్రీతి లక్ష్యంగా ఉన్నాయి
సుధామూర్తి పై మోసం ప్రయత్నం
సెప్టెంబర్ 5న ఉదయం సుధామూర్తికి ఒక గుర్తుతెలియని నంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసే వ్యక్తి తనను కేంద్ర టెలికాం శాఖ ఉద్యోగి అని పరిచయం చేసి, ఆమె మొబైల్ నంబర్ ఆధార్‌కు అనుసంధానం కాలేదని, ఆ నంబర్ నుండి అసభ్యకరమైన సందేశాలు పంపబడుతున్నాయని ఆరోపించాడు. వెంటనే స్పందించకపోతే నంబర్‌ను బ్లాక్ చేస్తానని బెదిరింపు ఇచ్చాడు.
సుధామూర్తి అనుమానంతో అప్రమత్తత చూపడం వలన మోసం విఫలమైంది. తర్వాత ట్రూకాలర్‌లో నంబర్‌ను పరిశీలించినప్పుడు ‘టెలికాం డిపార్ట్‌మెంట్’ అని చూపించడం గమనార్హం. సుధామూర్తి తరఫున గణపతి అనే వ్యక్తి జాతీయ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్, పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 20న సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రీతి సుధాకర్ పై సైబర్ మోసం
ముంబై సైబర్ క్రైమ్ అధికారులుగా చూపస్తూ, ఆగస్టు 26న ప్రీతి సుధాకర్ కి వాట్సాప్ కాల్ జరిగింది. ఈ కాల్ ద్వారా ఆమె బ్యాంక్ ఖాతా అక్రమంగా డబ్బు బదిలీ అయ్యిందని నమ్మించి, ₹14 లక్షలు మోసపూరితంగా తీసుకున్నారు.
కానీ, బాధితురాలు వెంటనే ఫిర్యాదు చేసినందున, సైబర్ పోలీసులు ఒక వారం రోజుల్లోనే మోసపూరిత డబ్బును ఫ్రీజ్ చేసి తిరిగి ఆమెకు అందజేశారు.