Stunt Master Dead

Stunt Master Dead: స్టంట్ చేస్తుండగా ప్రమాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి

Stunt Master Dead: తమిళ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు (వయస్సు 52) ఆదివారం (జూలై 13) ఒక స్టంట్ చేయడంలో అపశృతి కలిగి ప్రాణాలు కోల్పోయారు.

ప్రముఖ నటుడు ఆర్య హీరోగా, దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ‘వెట్టువం’ అనే చిత్ర షూటింగ్ తమిళనాడు నాగపట్నం జిల్లా, వేలంకన్ని సమీపంలో జరుగుతోంది. ఈ చిత్రంలో స్టంట్ మాస్టర్‌గా పని చేస్తున్న రాజు షూటింగ్‌లో భాగంగా కార్ స్టంట్ చేస్తున్నారు. కారు నుంచి దూకే సీన్‌లో, ప్రమాదవశాత్తూ జారిపడి గాయపడ్డారు. అక్కడికక్కడే ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో, దగ్గరలోని నాగపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

పరిశ్రమను కన్నీటి ముంచిన వార్త

ఈ ఘటనపై చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హీరో విశాల్ తన ట్విటర్‌లో ‘‘రాజు మాస్టర్ మృతి బాధాకరం. ఆయన నాకు చాలా సంవత్సరాలుగా తెలిసిన వ్యక్తి. ఎన్నో చిత్రాల్లో ఆయనతో పని చేశాను. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’’ అంటూ ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు.

అలాగే ఫైట్ మాస్టర్ సిల్వ కూడా రాజు మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ‘‘ఒక గొప్ప స్టంట్ ఆర్టిస్ట్‌ను కోల్పోయాం. ఇది స్టంట్ యూనియన్, చలనచిత్ర రంగానికి తీరని లోటు’’ అని అన్నారు.

మనం తెలుసుకోవాల్సింది…

స్టంట్ ఆర్టిస్ట్‌లు సినిమా వెనుక అసలైన హీరోలు. వాళ్ల కృషితోనే సీన్లు హైలైట్ అవుతాయి. కానీ వారు చేసే పనిలో ప్రాణహాని ఎప్పుడూ ఉంటుంది. స్టంట్ మాస్టర్ రాజు అకాల మరణం ఈ వాస్తవాన్ని మరోసారి గుర్తు చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *