Suicide: ఆ విద్యార్ధి చదువులోనే కాదు.. అన్నింటిలోనూ పస్ట్.. దీంతో ఆ విద్యార్థి ఓయూలో కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు.. కాలేజీలో బాగానే చదువుతున్నాడు..అంతేకాదు కెమికల్ టెక్నాలజీపై పుస్తకాన్ని రాసి శభాష్ కినిపించుకున్నాడు.. కానీ, మొన్న పరీక్షలో… అతి కూడా ఓ సబ్జెక్టులో ఫేలైయ్యాడు.. సబ్జెక్టులో ఫేలై.. గేట్‌లో ర్యాంక్ సాధించాడు.. పాస్ మార్కులు ఇవ్వాలని ప్రిన్సిపల్ ను కూడా కోరాడు.. ఆ ప్రిన్సిపల్ ఇవ్వలేని, మళ్లీ సప్లే పరీక్షలు రావాలని సూచించాడు.. దీనికి ఆ విద్యార్థి ఏం చేయాలని..మళ్లి బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి.. అంతే కదా.. కానీ, ఇక్కడ ఆ విద్యార్ధి ఏం చేశాడో తెలుసా…??
ఓయూలోని కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కెమికల్ ఇంజినీర్ విద్యార్థి ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. టెక్నాలజీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్ శశాంక్.. ఇంజనీరింగ్‌లో ఒక సబ్జెక్టు ఫైలయ్యి..గేట్ ఎగ్జామ్‌లో ర్యాంక్ సాధించాడు.
Also Read: Crime News: మైనర్ బాలికను కిడ్నప్ చేసి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు .
క్రెడిట్స్ ద్వారా పాస్ చేయాలని ప్రిన్సిపల్‌ను ప్రణయ్ శశాంక్ కోరాడు.. అయితే, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని తోటి విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. వెంటనే తోటి విద్యార్ధులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.. ప్రణయ్ శశాంక్ కు న్యాయం చేయాలని కళాశాల ముందు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు.
ఇప్పటికే కెమికల్ టెక్నాలజీపై పుస్తకాన్ని ప్రణయ్ శశాంక్ రాశాడు.. అయితే, క్రెడిట్స్ కలిసే అవకాశం తమ కళాశాలల్లో లేదని విద్యార్ధికి చెప్పానని, సప్లమెంటరీ రాసుకోవాలని సూచించామని ప్రిన్సిపల్ తెలిపారు. తొందరపడి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడని, ఆరోగ్యం నిలకడగా ఉంటే మే నెలల్లో పరీక్ష సప్లి నిర్వహిస్తామన్నారు.

