Earthquake: గ్రీస్‌లో మే 14 వ తేదీ ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. ఇది సాధారణ భూకంపం కాదు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూకంప కేంద్రం ఏజియన్ సముద్రంలో ఉన్న కాసోస్ ద్వీపం సమీపంగా ఉన్నట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకటించింది.
ఈ భూకంపం వల్ల భవనాలు, ఇళ్లు ప్రకంపించడంతో ప్రజలు ఇంటి బయటకు పరుగులు తీశారు. శక్తివంతమైన ప్రకంపనలు గ్రీస్ పరిసర దేశాలైన ఈజిప్ట్, ఇజ్రాయెల్, లెబనాన్, తుర్కియే, జోర్డాన్ వరకు విస్తరించాయి.
అధికారుల ఇప్పటి వరకు ఏ ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం నమోదు కాలేదు. అయినా భూకంప తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. టెక్టోనిక్ ప్లేట్లు చురుకుగా కదిలే ప్రాంతం కావడంతో భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Justice BR Gavai: 52వ ప్రధాన న్యాయమూర్తి.. సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం
Earthquake: కాసోస్ ద్వీపం ఒక శాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. ఇక్కడ జనాభా దాదాపు వెయ్యి మంది మాత్రమే. ఈ ద్వీపం క్రీట్, రోడ్స్ ద్వీపాల మధ్యలో ఉంది. అయితే ఇప్పుడు అదే ప్రాంతం భూకంపం తీవ్రతకు కేంద్రంగా మారడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.
ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా వరుసగా భూకంపాలు జరుగుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది పర్యావరణ మార్పుల తీవ్ర సంకేతంగా పరిగణించవచ్చు. భూకంపాల సంఖ్య పెరగడం, మరింత తీవ్రతతో ఉండటం భవిష్యత్తులో మరిన్ని సవాళ్లకు దారి తీయవచ్చు.