Siddu Jonnalagadda: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో స్టార్ బాయ్ సిద్ధు క్రేజ్ కొండెక్కి కూర్చుంది.. బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన జాక్ ఆ క్రేజ్ కి బ్రేక్ వేసింది.. ఇప్పుడు మరో సాలిడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తర్వాత డైరెక్టర్ రవికాంత్ పేరెపుతో మరో మూవీ చెయ్యబోతున్నాడు..క్షణం, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, బబుల్ గమ్ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరెపు, సిద్ధు కలిసి.. ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి బ్యాడాస్ అనే అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.. రగ్గడ్ లుక్ లో సిగరెట్ వెలిగిస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో సిద్ధు క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇంతకుముందు సినిమాల్లానే యూత్ ని ఎట్రాక్ట్ చేసే ఇంట్రెస్టింగ్ థింగ్స్ బ్యాడాస్ లో ఉంటాయని, ఈసారి ఆడియన్స్ ని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారని, సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని సిద్ధు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
