Stampede: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతోపాటు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Stampede: యోగా వేడుకల అనంతరం గేట్ నంబర్ 2 వద్ద అల్పాహారం పెడుతున్నారని అటువైపు తరలివెళ్లారు. విద్యార్థులు, యువత ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే సిబ్బంది ఆ యువతికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంకొందరికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో అక్కడ విషాదం అలుముకున్నది.