SSC Exams:

SSC Exams: మార్చి 21 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు.. ఏర్పాట్లు పూర్తి

SSC Exams: తెలంగాణ ప‌రీక్ష‌ల కాలం కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టికే ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు పూర్త‌వ‌గా, మార్చి 21 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఆరంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో అటు త‌ల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో ఆందోళ‌న నెలకొన్న‌ది. ఫ‌లితాలెలా వ‌స్తాయో? ఎన్ని మార్కులు వ‌స్తాయో? పైచ‌దువుల‌కు స‌రిపోయే మార్కులు సాధ్య‌మేనా? అన్న లెక్క‌ల్లో ఉండగా, ప్ర‌శాంతంగా నిర్వ‌హించేందుకు అధికారులు ఏర్పాట్ల‌లో మునిగిపోయారు.

SSC Exams: రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల కోసం హాల్‌టికెట్ల‌ను విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు హాజ‌రుకానున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా 2,650 ప‌రీక్ష కేంద్రాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.

SSC Exams: ప్ర‌తిరోజూ ప‌రీక్ష ఉద‌యం 9.30 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతుంది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ ప్ర‌కారం తొలిరోజైన‌ మార్చి 21న ఫ‌స్ట్ లాంగ్వేజ్‌, మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్‌, మార్చి 24న ఇంగ్లిష్‌, మార్చి 26న మ్యాథ్స్‌, మార్చి 28న భౌతిక శాస్త్రం, మార్చి 29న బ‌యాల‌జీ, ఏప్రిల్ 2వ తేదీన సాంఘిక శాస్త్రం ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి.

SSC Exams: అదే విధంగా ఏప్రిల్ 3వ తేదీన ఒకేష‌న‌ల్ కోర్సు పేప‌ర్‌-1 లాంగ్వేజ్ ప‌రీక్ష‌, ఏప్రిల్ 4వ తేదీన ఒకేష‌న‌ల్ కోర్సు పేప‌ర్‌-2 లాంగ్వేజ్ ప‌రీక్ష జ‌రుగుతుంది. ఆయా పరీక్ష కేంద్రాల వ‌ద్ద ప్ర‌భుత్వం గ‌ట్టి పోలీస్ బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌గా, ప‌రీక్ష‌ల స‌మయాల్లో నిఘా ఏర్పాట్లు చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *