Mahesh Babu: ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రావడం లేదు కానీ ఎవరికి వారు ఇన్ డైరెక్ట్ గా ఆ సినిమా గురించి హింట్స్ ఇస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా ప్రియాంక చోప్రా తెలంగాణాలో చక్కర్లు కొడుతున్నారు. ఆమె వచ్చింది మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ కోసమని మీడియా కోడై కూస్తోంది కానీ ప్రియాంక మాత్రం పెదవి విప్పడం లేదు. చిలుకూరు బాలాజీని దర్శించుకోవడంతో పాటు కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోటలో కొలువైన మహాదేవుని ఆలయంలో పూజలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ సింహాన్ని బోనులో బంధించి, చేతిలో పాస్ పోర్ట్ ను చూపిస్తున్న బుల్లి వీడియోను రాజమౌళి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సింహాన్ని కాప్చర్ చేశానంటూ ఆయన వ్యాఖ్యానించారు. దానికి మహేశ్ బాబు ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ కామెంట్ పెట్టారు. మొత్తానికీ వీరిద్దరి దోబూచులాటతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారిపోయింది. ఇంతకూ సినిమా సెట్స్ పైకి వెళ్ళిది ఎప్పుడో చెప్పండి మహాప్రభో అంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram