Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ చిత్రాల్లో ఆమె చెంపలకు పసుపు రాస్తూ, పెళ్లి కూతురు లుక్‌లో కనిపించడం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. “ఈ రోజు నా బిగ్ డే, కమింగ్ సూన్.” అని క్యాప్షన్ జోడించడంతో, శ్రీలీల నిశ్చితార్థం చేసుకుందా అనే అనుమానాలు తలెత్తాయి.
ఫ్యాన్స్ ఒకవైపు ఆమె పెళ్లి పీటలెక్కబోతోందని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు ఇది సినిమా షూటింగ్ లేదా యాడ్ కోసమేమోనని ఊహిస్తున్నారు.
Also Read: Ram Charan: రాయల్ లుక్‌తో అభిమానులను ఫిదా చేస్తున్న గ్లోబల్ స్టార్!
Sreeleela: ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్‌తో, తెలుగులో రవితేజతో సినిమాలు చేస్తోంది. తమిళంలోనూ రెండు ప్రాజెక్టుల్లో ఉన్నట్లు సమాచారం. అయితే, ఆమె ఇటీవలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. రాబోయే సినిమాలు ఆమెకు కలిసొస్తాయా? ఈ ఫొటోల రహస్యం ఏమిటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే..