UTTAM KUMAR REDDY: ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూలిపోయాయో విదేశాంగ శాఖ ఇప్పటికీ స్పష్టం చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో తెలిపారు. ఆయన పేర్కొన్నట్టు, ఆపరేషన్ సిందూర్ భారతానికి గొప్ప విజయం కావడంతో అందరికి అభినందనలు తెలియజేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) సహా పాకిస్థాన్‌లో ఉగ్రవాదులపై ఖచ్చితమైన దాడులు జరిగాయని పేర్కొన్నారు.
రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయిందా అన్న ప్రశ్నపై కాంగ్రెస్ నేతలను దేశ ద్రోహులు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే సీడీఎస్ అనిల్ చౌహాన్ రాఫెల్ కూలిపోయింది నిజమేనని స్వీకరించిన సంగతి తెలిసిందే. దీంతో అయనపై కూడా దేశద్రోహి అంటూ విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తిలో ఆలస్యం ఉందని ఎయిర్ మార్షల్ చెప్పారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించారని పేర్కొన్నారు. ఇన్‌టైమ్‌లో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీలో హాల్ (HAL) ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు. అందువల్ల HALలో ఉత్పత్తి పెంచుకోవడానికి చర్చలు జరపాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాస్తవానికి, ఏడాదికి HAL 24 ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అది సాధ్యపడడం లేదని చెప్పారు. రక్షణ రంగంలో మేధావులు కలిసివచ్చి పని చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.