Spirit: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఉత్సాహం అంటే ఇదే! సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలుకానుంది. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి, మెక్సికోలోని కీలక లొకేషన్స్ ఖరారు చేశారు. రాజా సాబ్ షూటింగ్‌ను వేగంగా ముగించిన ప్రభాస్, ఇక స్పిరిట్ సెట్స్‌పై అడుగుపెట్టనున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నెవర్ బిఫోర్ లుక్‌లో ఆకట్టుకోనున్నారు.
Also Read: Kingdom: నెవర్ బిఫోర్.. ఉత్కంఠ రేపుతున్న “కింగ్‌డమ్” ట్రైలర్!
హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. భద్రకాళి పిక్చర్స్‌పై ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని పాటలు ఇప్పటికే రికార్డ్ అయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ జోష్‌లో ఉన్నారు!

