Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న కొత్త చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్‌గా సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాలో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గతంలో వచ్చిన హీరోయిన్ రూమర్లకు చెక్ పెడుతూ, త్రిప్తి ఎంపిక సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
త్రిప్తి ఎంపికతో మేకర్స్ భారీగా బడ్జెట్ ఆదా చేసినట్లు సమాచారం. దీపికా స్థానంలో ఆమెను తీసుకోవడం ద్వారా ఆర్థికంగా లాభం చేకూరడంతో పాటు, టాలెంటెడ్ హీరోయిన్‌ను ఎంచుకున్నారని టాక్.
Also Read: SSMB29లో మరో టాప్ బ్యూటీ?
Spirit: ‘అనిమల్’ సినిమాతో త్రిప్తికి సందీప్ అద్భుతమైన గుర్తింపు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్‌గా ఆమె ఎంపిక కావడంతో, మరింత అద్భుతంగా పనిచేసే అవకాశం ఉందని అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ కాంబినేషన్ సినిమాకు సంబంధించి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.