SSMB29 : దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, సెకండ్ హాఫ్‌లో కీలక పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌ను తీసుకోవాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే, సినిమాపై హైప్ మరింత పెరగనుంది! పాన్ ఇండియా సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
SSMB29 : రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ నవలల స్ఫూర్తితో స్క్రిప్ట్ రాసినట్లు వెల్లడించారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, దేవా కట్టా సంభాషణలు రాస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ తెలుగు సినిమా స్థాయిని మరోస్థాయికి తీసుకెళ్లనుందని అందరూ ఆశిస్తున్నారు.
Also Read: Venky Atluri-Suriya: వెంకీ సినిమాలో సూర్య రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్?