Odisha: కొన్ని సంఘటనలు సినిమా కథలను మించి ఉంటాయి. ఆ సంఘటనల్లో ఉన్న వ్యక్తులు వారి అనుభవాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటిదే ఇది కూడా. ఎక్కడో స్పెయిన్ లో చదువుకుంటున్న అమ్మాయి.. భారత్ వచ్చి తన తల్లిని కలుసుకుంది.. అందులో పెద్దగా విశేషం ఏమీ కనిపించడం లేదు కదూ… కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది.. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్నేహ అనే 21 ఏళ్ల అమ్మాయి దాదాపు పదిహేనేళ్లు స్పెయిన్ దేశస్థురాలిగా పెరుగుతోంది. ఆమెకు తన మూలాలు భారత్ లో ఉన్నాయని తెలిసింది. దీంతో ఉన్నపళంగా ఇక్కడికి వచ్చి కన్నతల్లి కోసం అన్వేషణ సాగిస్తోంది. ఏడాది వయసున్న స్నేహను, నెలల బాలుడైన ఆమె తమ్ముడు సోమూను ఒడిశాలో ఓ కన్నతల్లి నిస్సహాయ స్థితిలో వదిలేసుకొంది. 2005 నుంచి అనాథా శ్రమంలో ఈ చిన్నారులు పెరిగారు. ఈ క్రమంలో 2010లో స్పెయిన్ దంప తులు వీరిని దత్తత తీసుకొన్నారు. ఏ లోటూ రాకుండా పెంచుకున్నారు. ఉన్నత విద్యావంతులను చేశారు. తాజాగా తన గతం వివరాలు పెంచిన తల్లిదండ్రుల ద్వారా స్నేహకు తెలిశాయి. యోగా టీచరు అయిన పెంచిన తల్లి గెమాతో కలిసి వెంటనే స్పెయిన్ నుంచి భారత్ కు వచ్చింది. స్థానిక హోటలులో ఈ యువతి ఉంటూ ‘అమ్మ’ ఆచూకీ కోసం వెతుకులాడుతోంది.
ఇది కూడా చదవండి: Mega Star Chiranjeevi: ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు.. చక్కటి ప్రవర్తన కూడా ఉండాలి..
Odisha: ఒడిశాకు చెందిన బానలతా దాస్ నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్లోని నయాపల్లిలో అద్దె ఇంట్లో ఉండేవారు. ప్రైవేటు కంపెనీలో వంటమని షిగా పనిచేసే ఆమె భర్త సంతోష్ వారిని వదిలేయడంతో కుటుంబపోషణ భారంగా మారింది. దీంతో ఇద్దరు పిల్లలను (స్నేహ, సోము) అద్దె ఇంట్లోనే వది లేసి.. మరో ఇద్దరు పిల్లలతో ఆమె ఎటో వెళ్లిపోయింది. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్నేహ, సోమును స్థానిక అనాథాశ్ర మంలో చేర్పించారు. అక్కడి నుంచి తమ్ముడితో పాటు స్పెయిన్ కు దత్తత వెళ్లిన స్నేహ.. ఇన్నాళ్లకు భారత్ తిరిగివచ్చింది. స్నేహ తల్లి బానలతా కటక్ జిల్లాలో ఉన్నారని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. డిసెంబరు 19న భువనేశ్వర్ వచ్చిన స్నేహ చదువు రీత్యా జనవరి 6న తిరిగి స్పెయిన కు వెళ్లాల్సి ఉంది. మార్చిలో మళ్లీ వచ్చి అమ్మను కలుస్తానని స్నేహ చెబుతోంది.