SpaceX Starship

SpaceX Starship: టెస్టింగ్ సమయంలోనే పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్

SpaceX Starship: అమెరికాలోని టెక్సాస్‌లో స్పేస్‌ఎక్స్ సంస్థ నిర్వహించిన పరీక్షా కార్యక్రమం హఠాత్తుగా ప్రమాదంలోకి దారి తీసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ ప్రైవేట్ స్పేస్ కంపెనీ బుధవారం రాత్రి “స్టాటిక్ ఫైర్ టెస్ట్” పేరిట స్టార్‌షిప్ రాకెట్‌పై టెస్ట్ చేస్తుండగా ఒక్కసారిగా అది పేలిపోయింది.

పేలుడు అనంతరం భారీ మంటలు, అగ్నికీలలు ఆకాశాన్ని తాకాయి. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అధికారులు వెంటనే స్పందించి ప్రాంతాన్ని సురక్షితంగా మార్చారు.

ఇది కూడా చదవండి: Voter ID Card: 15 రోజుల్లో ఓటర్ ఐడీ, ఎలా అప్లై చేసుకోవాలంటే ?

ఈ టెస్ట్ స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ 10వ టెస్టింగ్ కోసం నిర్వహించబడింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై స్పేస్‌ఎక్స్ తమ అధికారిక ఎక్స్‌ (ట్విటర్) ఖాతాలో వీడియో షేర్ చేసింది. సిబ్బంది ముందుగానే అప్రమత్తంగా ఉండటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే పరిసర ప్రాంత ప్రజలకు కూడా ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతానికి రావొద్దని ప్రజలకు సూచించారు.

గత కొంతకాలంగా స్పేస్‌ఎక్స్ ప్రయోగాలు వరుసగా విఫలమవుతున్నాయి. కొన్ని రాకెట్లు అంతరిక్షంలోకి వెళ్తుండగానే పేలిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజా ఘటన స్పేస్ పరిశోధనల లో కీలకమైన సమయాల్లో ఈ కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *