South-North Koreas: ఎప్పటి నుంచో ఉన్న ఉద్రిక్తతలు మళ్లీ గుబులు పుట్టిస్తున్నాయి. ఈ రెండు శత్రు దేశాల నడుమ దశాబ్దాల కాలం నుంచి శత్రుత్వం కొనసాగుతూ వస్తున్నది. ఇప్పటికీ వైరం నడుస్తున్నది. ఒక దేశమంటే మరో దేశానికి మధ్య ఉప్పునిప్పులా పరిస్థితి మారింది. కొద్దికాలంగా సద్దుమణిగిన వివాదం మళ్లీ రాజుకునే పరిస్థితి నెలకొన్నది. దీంతో ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది.
South-North Koreas: ఇప్పటికే ఇరాక్-ఇజ్రాయెల్, రష్యా-ఉక్రెయిన్, భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచ శాంతిని కొంతవరకు అస్థిరపరుస్తున్నది. తాజాగా ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య బార్డర్‌లో హైటెన్షన్ నెలకొన్నది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా సైనక విన్యాసాలు కొనసాగిస్తున్నది. ఇరు దేశాలకు చెందిన 21 వేల మంది సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు.
South-North Koreas: దక్షిణ కొరియా దేశ సైనిక విన్యాసాల పట్ల ఉత్తర కొరియా అధినేత కిమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైనిక విన్యాసాల పేరిట రెచ్చగొట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ దశలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బార్డర్‌లో ఇరు దేశాల సైనికులు మోహరించి ఉన్నట్టు వార్తలు అందుతున్నాయి.

