South Africa vs Bangladesh: క్రికెట్లో గొడవలు కామన్. ఆటగాళ్లు దూషించుకోవడం, ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లడం తరుచుగా జరుగుతుంటాయి. ఇక బంగ్లాదేశ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అన్నట్లుగా ఆ టీమ్ ఆటగాళ్ల వ్యవహార శైలి ఉంటుంది. అయితే ఈ సారి బంగ్లా ప్లేయర్పైకే ప్రత్యర్థి ఆటగాడు దూసుకొచ్చి కొట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది.
మిర్పూర్ వేదికగా దక్షిణాఫ్రికా-ఈ, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఈ వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ షెప్టో తులి ఆ టీమ్‌కే మాయని మచ్చ తీసుకొచ్చేలా ప్రవర్తించాడు. ఈ యువ బౌలర్ ప్రత్యర్ధి బ్యాటర్ సిక్స్ బాదడని దాడికి దిగాడు. బంగ్లా ఇన్నింగ్స్ 105వ ఓవర్ వేసిన తులి బౌలింగ్‌లో తొలి బంతిని రిపోన్ మోండోల్ సిక్సర్ బాదాడు. దీంతో సహనాన్ని కోల్పోయిన సఫారీ బౌలర్.. రిపోన్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అతడి వద్దకు వెళ్లి చేయి చేసుకున్నాడు.
Also Read: Dhoni-Jadeja: ధోనీని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు ఏం జరిగిందంటే..?
South Africa vs Bangladesh: ఈ నేపథ్యంలో రిపోన్ కూడా తిరగబడడంతో లొల్లి పెద్దదైంది. ఇద్దరు ఆటగాళ్ళు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అంపైర్‌లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీరిద్దరిపై ఐసీసీ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశముంది.