Dhoni-Jadeja

Dhoni-Jadeja: ధోనీని ఫస్ట్ టైమ్​ కలిసినప్పుడు ఏం జరిగిందంటే..?

Dhoni-Jadeja: ధోనీ-జడేజా ఫ్రెండ్​ షిప్ గురించి అందరికీ తెలిసిందే. ఇటు ఐపీఎల్ అటు టీమిండియా కోసం ధోనీతో కలిసి ఎన్నో ఏళ్లు ట్రావెల్ చేశాడు. ఈ క్రమంలో ధోనిని మొదటిసారి కలిసిన సంఘటనతో పాటు కొన్ని ఆసక్తికర విషయాలు జడ్డూ షేర్ చేసుకున్నాడు. మొదట్లో ధోనీని కలవడానికి టెన్షన్ పడినట్లు తెలిపాడు. ఇప్పటికీ కూడా ధోనీ సరైన మూడ్​లో లేనప్పుడు మాట్లాడాలంటూ కాస్త భయంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఇక జడేజా ధోనీని 2005లో తొలిసారి కలిసినట్లుగా తెలిపారు. ‘‘నేను 2005లో ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా ఫస్ట్ టైమ్​ ధోనీని కలిశాను. ముంబై నుంచి ఫ్లైట్​లో వస్తుండగా.. అదే ఫ్లైట్‌లో ధోనీ కూడా ప్రయాణించాడు. నేను ఎకానమీ క్లాస్‌లో కూర్చుంటే, అతడు బిజినెస్‌ క్లాస్‌లో ఉన్నాడు. కానీ నేను అతన్ని కలవడానికి టెన్షన్ పడ్డాను. అప్పుడు మా మేనేజర్‌.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ధోనీతో కలిసి టీమ్‌ మొత్తం హోటల్‌కు వెళ్లాలి అని తెలిపాడు. అప్పుడు నాకు టెన్షన్ అనిపించింది. అతడితో ఎలా వెళ్లాలి..అతడు ధోనీ కదా అని ఆలోచించా. అయితే అదే టైమ్​లో ధోనీ తన ఫోన్ పారేసుకున్నాడు. ఇదే మంచి సమయం అనుకుని మెల్లిగా అక్కడినుంచి జారుకున్నాను’’అని జడేజా వివరించాడు.

Also Read: IPL: మొహాలీ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విఫలం

Dhoni-Jadeja: అంతేకాకుకుండా ఇప్పటికీ కూడా ధోనీ మూడ్ బాగాలేనప్పుడు మాట్లాడాలంటే భయమెస్తుందని జడేజా అన్నాడు. ఒకవేళ మాట్లాడిన ధోనీ ఏమి అనడు.. కానీ ధోనీ ముఖంలో తాను మాట్లాడే మూడ్‌లో లేడన్న విషయం తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా 2018, 2021, 2023లో చెన్నై.. ఐపీఎల్‌ టోర్నీ గెలవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. 2023 ఫైనల్‌లో అయితే మోహిత్ శర్మ బౌలింగ్‌లో జడేజా చివరి రెండు బంతుల్లో పది పరుగులు చేశాడు. ఇలా చెన్నై జట్టు అయిదోసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కానీ ప్రస్తుత సీజన్‌లో మాత్రం జడేజా అంతగా రాణించలేదు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కూడా ప్లేఆఫ్స్‌నకు చేరకుండానే నిష్క్రమించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Dhoni Political Entry: మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రాజకీయాల్లోకి వస్తున్నాడా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *