T20: పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా జట్టు 55 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి తీవ్రంగా నిరాశపరచడం జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. వారి బ్యాటర్లు దూకుడుగా ఆడారు, ముఖ్యంగా క్వింటన్ డి కాక్ (47) ఇతర కీలక ఆటగాళ్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేకపోయింది.
ఇది కూడా చదవండి: Jaanvi Ghattamaneni: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!
జట్టు ఆశలన్నీ పెట్టుకున్న కెప్టెన్ బాబర్ ఆజం (3 పరుగులు) కేవలం 6 బంతుల్లోనే ఔటై పెవిలియన్‌కు చేరాడు. దీంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే దెబ్బతింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో సాయిమ్ అయూబ్ (28) మినహా ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మిగతా బ్యాటర్లందరూ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు క్యూ కట్టారు. పాకిస్తాన్ జట్టు కేవలం 18.1 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే అద్భుతంగా రాణించి పాక్ బ్యాటింగ్‌ను కకావికలం చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

